Kitchenvantalu

రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయానికి ఇలా వేడివేడి పొరల పరాఠా చేసుకోండి!

Dal Parata recipe with Leftover dal Recipe: రాత్రి వండిన పప్పు మిగిలిపోయిందా? ఉదయం దాన్ని మళ్లీ వేడి చేసి తినాలంటే ఇంట్లో ఎవరూ ఇష్టపడరు. అలా అని కష్టపడి వండిన దాన్ని పారేయడానికి మనసొప్పదు కదా!

ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి ఇంట్లో ఎదురయ్యేదే. అందుకే, ఈసారి పప్పు మిగిలిపోతే అస్సలు ఆలోచించకండి. ఆ పప్పుతోనే భలే రుచికరమైన, నోట్లో వేసుకుంటే కరిగిపోయే ‘పొరల పరాఠా’ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను.

చపాతీ పిండిలో నీళ్లకు బదులు ఈ పప్పు, కొద్దిగా మసాలాలు వేసి కలిపితే చాలు.. పరాఠాలు ఎంత సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తాయంటే పిల్లలు లంచ్ బాక్స్‌లోకి కూడా ఇవే కావాలని మారం చేస్తారు. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ దాల్ పరాఠా ఎలా చేయాలో చూసేద్దాం రండి!

టిఫిన్, లంచ్ లోకి పరాఠా పర్ఫెక్ట్ రెసీపీ. మెత్తగా ఉడికించిన పప్పుతో కాని, మిగిలిపోయిన పప్పుతో కాని, పరాఠాలు చేసుకుని, లంచ్ లోకి లాగించేయండి.

కావాల్సిన పదార్థాలు
ఉడికించిన కందిపప్పు – ¼ కప్పు
గోధుమ పిండి – 2 కప్పులు
ఉప్పు – తగినంత
పసుపు – కొద్దిగా
నలిపిన వాము – 1/4టీ స్పూన్
నలిపిన జీలకర్ర-1/4టీ స్పూన్
కారం – 1/2టీ స్పూన్
జీలకర్ర పొడి – 1/2టీ స్పూన్
అల్లం తరుగు – 1 టీ స్పూన్
వెల్లుల్లి తరుగు – 1 టీ స్పూన్
నూనె – 1 స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్
నూనె – తగినంత

తయారీ విధానం
1.ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమపిండి, పదార్థాలు అన్ని వేసి, పండిని కలుపుకుని, తగినన్ని నీళ్లు వేస్తూ, పిండిని ముద్దలా కలుపుకుని 15 నిముషాలు పక్కన పెట్టాలి.
2.నానిన పిండిని సమానంగా ఉండలు చుట్టుకుని, రొట్టెల పీటపై, మందంగా, మడతలు వేసుకుంటూ, చతురశ్రాకారంగా కాల్చుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, వేడెక్కిన తర్వాత కాల్చుకున్న రొటీని, వేడి ప్యాన్ పై వేడి, రెండు వైపులా కాలనివ్వాలి.
4. ఇప్పుడు రెండు వైపులా నూనె వేస్తూ, ఎర్రగా, కాల్చుకోవాలి.
5. అంతే , దాల్ పరాఠా రెడీ అయినట్లే.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."