Kitchenvantalu

Sink cleaning Tips:కిచెన్ సింక్ శుభ్రంగా ఉండాలంటే సింపుల్ చిట్కాలను ట్రై చేయండి..

Kitchen sink cleaning tips in telugu: కిచెన్ సింక్ శుభ్రంగా ఉండాలంటే సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.. మీ కిచెన్ సింక్ సరికొత్తగా కనిపించడానికి కొన్ని చిట్కాలను ప్రయత్నించండి. వీటితో త్వరగా కిచెన్ సింక్ మురికిని వదిలించుకోవచ్చు. వంట గదిలో శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. వంట గదిలో పాత్రలు మరియు సింక్ శుభ్రంగా ఉండటం కూడా ముఖ్యం.

అలాగే వంటగదిలో అతి ముఖ్యమైన సింకులో అనేక రకాల పాత్రలు, పదార్థాలను పాడేస్తూ ఉంటాం. అందుకే సింకు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. సింక్ శుభ్రంగా లేకపోతే బ్యాక్టీరియా పేరుకుపోతుంది.

దీనివల్ల దుర్వాసన వస్తుంది. సింకు శుభ్రంగా ఉండటానికి కొన్ని రకాల రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంటి చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా సింకులో నూనె వంటి జిడ్డు పదార్ధాలను తొలగించడానికి సింక్ లో వేడి నీరు పోసి కొంచెం బ్లీచింగ్ పౌడర్ జల్లి ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత బ్రష్ సాయంతో శుభ్రం చేస్తే సరిపోతుంది.

వెనిగర్, నిమ్మరసం సింక్ ని శుభ్రం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది, వీటిలో ఉండే సహజ సిద్ధమైన ఆమ్లం మురికిని చాలా లోతుగా శుభ్రం చేస్తుంది. వెనిగర్, నిమ్మరసం కలిపి సింక్ లో పోసి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత వేడి నీటితో శుభ్రం చేయాలి. ఈ చిట్కాలను పాటిస్తే కిచెన్ శుభ్రంగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."