Chocolate oats :పోషకాల లోపం లేకుండా చేసే ఆరోగ్యకరమైన చాకోలెట్ ఓట్స్
Chocolate oats: మార్నింగ్ టిఫిన్స్ ప్లేస్ లో, హెల్త్ కాన్సియస్ ఉన్నవాళ్లు, ఓట్స్ తయారు చేసుకుంటారు. ఓట్స్ ను రెగ్యూలర్ గా కాకుండా,చాక్లెట్ మిల్క్ మిక్స్ చేసి,ఈజీ, టేస్టీ, హెల్తీ, చాక్లెట్ ఓట్స్ చేసేయండి.
కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ – 1కప్పు
పాలు – 400ml
నీళ్లు – ½ కప్పు
కోకో పౌడర్ – 3 టేబుల్ స్పూన్స్
తేనె – 2 టేబుల్ స్పూన్స్
వెనీలా – 1/2టేబుల్ స్పూన్
ఎండుకొబ్బరి తురుము – 1/4కప్పు
బాదం పలుకులు – 2 టేబుల్ స్పూన్స్
అరటి పండు ముక్కలు – 1
ఖర్జూరం – 3
తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టికుని, ఎండుకొబ్బరిని, దొరగా వేయించుకోవాలి.
2. కొబ్బరిని తీసేసి, అదే మూకుడులో, నీళ్లు ,పాల్లు పోసి పొంగనివ్వాలి.
3.పొంగుతున్న పాలల్లో నుంచి, కొన్ని పాలు తీసి, కోకో పొడిలో వేసి,ఉండలు లేకుండా కలుపుకోవాలి.
4.పొంగిన పాలల్లో, ఓట్స్ వేసి, మెత్తగా ఉడికించుకోవాలి.
5.ఉడికిన ఓట్స్ లో కలిపి ఉంచిన, చాక్లెట్ మిక్స్ వేసి, కాసేపు ఉడికించాలి.
6.స్టవ్ ఆపేసిన తర్వాత, వెనీలా ఎసెన్స్, ఉప్పు, తేనె, వేసి కలుపుకోవాలి.
7. సెర్వింగ్ బౌల్ లోకి తీసుకుని, దాని పైన, కొబ్బరి పొడి, అరటిపండు స్సైసెస్,బాదం , కర్జూరం ముక్కలు వేసి వేడి వేడిగా సెర్వ్ చేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News

