Healthhealth tips in telugu

Iron Deficiency: ఈ ఒక్క లడ్డుతో శరీరంలో ఐరన్‌ లోపం సమస్యలకు చెక్‌..

Iron Deficiency: శరీరంలో ఐరన్ లోపం వచ్చినప్పుడు రక్తహీనత సమస్యకు కారణం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రక్తహీనత సమస్య కనబడుతోంది రక్తహీనత కారణంగా ఎన్నో రకాల సమస్యలు ఏర్పడతాయి. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు మనం ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..

దీనికోసం వాల్ నట్స్ తీసుకోవాలి వాల్ నట్స్ లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. నువ్వులలో తెల్ల నువ్వులను తీసుకోవాలి.తెల్ల నువ్వులలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత బెల్లం కూడా తీసుకోవాలి.బెల్లంలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఒక అరకప్పు వాల్నట్స్ అరకప్పు నువ్వులు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి.

ఈ పొడిలో అర కప్పు బెల్లం తురుము వేసి మూడు కలిపి కొంచెం ఆవు నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకొని ప్రతిరోజు ఒకటి తింటూ ఉండాలి ఈ విధంగా ప్రతి రోజు ఒక లడ్డూ తింటూ ఉంటే తగ్గి రక్తహీనత సమస్య తొలగిపోతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.

ఈ లడ్డు రక్తహీనత సమస్యలు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది. అలాగే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అలసట,నీరసం,నిసత్తువ వంటివి అన్నీ తొలగిపోయి చురుకుగా,ఉషారుగా ఉంటారు. ఈ లడ్డులను ఒకసారి చేసుకొని 10 రోజుల పాటు తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."