Kitchenvantalu

Vegetable Pasta Recipe:పాస్తాని ఇలా చేసి పెట్టండి.. పిల్లలు అందరు ఇష్టంగా తింటారు

Vegetable Pasta Recipe:పిల్లలు ,పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పాస్తా అన్ని కూరగాయలతో కలిపి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పాస్తా – 2 కప్పులు
క్యాప్సికం తరుగు – ½ కప్పు
టొమాటో తరుగు- ½ కప్పు
క్యారేట్ తరుగు – ½ కప్పు
ఉల్లిపాయ తరుగు- ½ కప్పు
బంగాళదుంపలు – 1/2 కప్పు
పచ్చి బఠానీలు – ½ కప్పు
పచ్చిమిర్చి – 4-5
వెల్లుల్లి తరుగు – 1 టేబుల్స్ స్పూన్
నూనె – 1 3/4 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
సోయా సాస్ – 2 టీ స్పూన్స్
వెనిగర్ – 1 టీ స్పూన్
రెడ్ చిల్లి సాస్ – 1 టీ స్పూన్
టొమాటో సాస్ – 1 టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – ½ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ప్యాన్ 2 కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేసుకోని పాస్తా ను ఉడికించుకోవాలి.
2.వేరొక ప్యాన్ లో 1 ½ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోని అందులోకి ఉల్లిపాయలు,వెల్లుల్లి యాడ్ చేసి వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక అందులోకి కూరగాయ ముక్కలు వేసి టమాట మెత్తపడే వరకు మూత పెట్టుకోని ఉడికించుకోవాలి.
4.కూరగాయలు ఉడికాక అందులోకి పచ్చిబఠానీలు వేసి ఉడకనివ్వాలి.

5.మరోవైపు ఉడికిన పాస్తాను వడకట్టుకోని కాసేపు పక్కన పెట్టుకోని
6.ఇప్పుడు పాస్తాలోకి సాస్ లు జోడించి బాగా మిక్స్ చేసుకోవాలి.
7.అందులోకి సరిపడ ఉప్పు,పెప్పర్ పొడి వేసుకోని బాగా కలుపుకోని వెజిటెబుల్స్ లో కలుపుకోవాలి.
8.రెండు నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లుకోని సర్వ్ చేసుకోవడమే.