Healthhealth tips in telugu

Lungs Detox drink: ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసే డిటాక్స్‌ డ్రింక్.. చాలా సులభంగా..

Lungs Detox drink:ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందిని దగ్గు,జలుబు వంటి సమస్యలు వేదిస్తున్నాయి. ఈ చలికాలంలో శ్వాస కోశ స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సమస్య ఉన్నవారిలో ఛాతిలో క‌ఫం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక దాన్ని తొల‌గించి ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

దీని కోసం ఒక డ్రింక్ తయారుచేసుకోవాలి. పది నుంచి పదిహేను పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఈ పుదీనా ఆకులలో అంగుళం అల్లం ముక్క వేసి మెత్తగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి పుదీనా,అల్లం పేస్ట్ వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేయాలి.

రెండు నిమిషాలు అయ్యాక ఈ నీటిని గ్లాసులోకి వడకట్టాలి. దీనిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా 3 రోజుల పాటు చేస్తే ఊపిరితిత్తులలో కఫం, నిమ్ము వంటి సమస్యలు తగ్గటమే కాకుండా దగ్గు,జలుబు,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

పుదీనా, అల్లం, పసుపులో ఉన్న గుణాలు ఈ చలికాలంలో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోదకశక్తిని పెంచుతుంది. అలాగే ఈ డ్రింక్ ని అన్నీ వయస్సులవారు తాగవచ్చు. చిన్న పిల్లలు అయితే అరగ్లాసు, పెద్దవారైతే ఒక గ్లాస్ తాగవచ్చు. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."