Egg Yolk: గుడ్డులోని పచ్చసొన మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
Egg Yolk Benefits:రోజుకి ఒక గుడ్డు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. అయితే మనలో చాలామంది పచ్చ సొన తీసేసి తెల్ల సొన తింటూ ఉంటారు. పచ్చ సొన తినవచ్చా లేదా తినకూడదా అనే విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి.
మనలో చాలామంది పచ్చ సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని తినడం మానేస్తుంటారు. ఇలా పచ్చసొన తినటం మానేసి తెల్ల సొన మాత్రమే తింటే గుడ్డులో ఉన్న పోషకాలు పూర్తిగా మన శరీరానికి అందవు. సగం పోషకాలు మాత్రమే అందుతాయి.
ఎందుకంటే గుడ్డు పచ్చసొనలో కూడా శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అది రక్తంలో కొవ్వును పెంచదని నిపుణులు చెబుతున్నారు.
కంటి ఆరోగ్యాన్ని పెంచే విటమిన్ ఎ, ఎముకలను బలంగా ఉంచే విటమిన్ కె, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఈ, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్-డి గుడ్డు పచ్చ సొనలో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలు గర్భిణీలు గుడ్డు పచ్చసొన తీసుకోవాలి. అప్పుడే అన్ని పోషకాలు శరీరానికి అందుతాయి..
చూశారుగా Egg లో ఉన్న పోషకాలు…అలాగే పచ్చసొనలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలుసుకున్నారుగా…మీరు కూడా తిని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


