Healthhealth tips in telugu

Tomatoes and cucumber : టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? ఈ విషయం తెలుసా..?

Tomatoes and cucumber : మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని అంది ఆరోగ్యంగా ఉంటాం. ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు మన శరీరానికి అందాలి.

కీరదోస,టమోటాలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా మందిని వేదిస్తుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి టమోటా,కీరదోస రెండు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీని కోసం ఒక జ్యూస్ తయారు చేసుకోవాలి.

ఒక మిక్సీ జార్ లో ఒక టమోటా ముక్కలు, కీరదోసలో సగాన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 10 పుదీనా ఆకులు,రెండు మిరియాలు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేసి గ్లాసులో పోసి అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. టమోటా,కీరదోస రెండింటిలో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ డ్రింక్ ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."