Kitchenvantalu

టేస్టీ టొమాటో కొత్తిమీర రోటి పచ్చడి.. ఇలా చేస్తే అన్నం మొత్తం దీనితోనే తినేస్తారు!

Tomato Kothimeera Pachadi: వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని, కమ్మటి టొమాటో కొత్తిమీర పచ్చడి కలుపుకుని తింటుంటే.. ఆ మజాయే వేరు కదూ!

రోట్లో నూరిన పచ్చడి రుచిని గుర్తుచేసేలా, భోజనంలోకి ఏ కూరా లేకపోయినా కడుపునిండా అన్నం తినేలా చేసే ఈ పచ్చడిని ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ పోస్ట్‌లో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ, దోశల్లోకి కూడా అదిరిపోయే ఈ రెసిపీని మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.

వేడి వేడి అన్నంలో రోటీ పచ్చడి , కాసింత నెయ్యి యాడ్ చేసుకుని తింటే, ఆ కిక్కే వేరు. కొత్తిమీరతో టమాటో పచ్చడి, తయారీ విధానం చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
టమాటా – 1/2 కిలో
ఉప్పు – తగినంత
కరివేపాకు – 2 రెమ్మలు
ఎండుమిరపకాయలు – 4
ఆవాలు – 1/2 టేబుల్ స్పూన్
తురిమిన బెల్లం – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – ఒక కప్పు
పచ్చిమిర్చి – 4
చింతపండు -20 గ్రాములు
శగనపప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
వెల్లుల్లి – 8 రెబ్బలు

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, నూనె వేడి చేసి, అందులోకి, ఎండుమిర్చి, శగనపప్పు, కొత్తిమీర వేసి, రంగుమారే వరకు వేపుకోవాలి.
2. ఇప్పుడు అందులోకి, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి, మూత పెట్టి మెత్తగా ఉడికించాలి.
3. ఉడుకుతున్న టమాటాలో , ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి.
4. ఉడికిన టమాటో మిశ్రమం, చల్లారిన తర్వాత, మిక్సీ జార్ లోకి, వేసుకుని, అందులోకి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, బెల్లం, వేసుకుని, గ్రైండ్ చేసుకోవాలి.
5. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
6. ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి, వేగిన తాళింపును, పచ్చడిలో వేసుకోవాలి.
7. అంతే టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."