Kitchenvantalu

Capsicum Egg Fry:గుడ్లు, కాప్సికంతో టేస్టీ గా కర్రీ చేయండి.. అన్నం, చపాతీ లోకి చాలా, బావుంటుంది.

Capsicum Egg Fry:క్యాప్సికం ఎగ్ ఫ్రై.. ఎగ్ మిక్సింగ్ తో చేసే ఏ రెసిపీ అయినా స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఇష్టంగా తినాలంటే ఎగ్ కంపల్సరీ. అందుకే క్యాప్సికం తో ఎగ్ మిక్స్ చేసి ఫ్రై చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
క్యాప్సికం – ½ kg
గుడ్లు – 3
పచ్చిమిర్చి – 2
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూన్
కారం – ½ స్పూన్
ఉప్పు – ½ స్పూన్
ఉల్లిపాయలు -1
కొత్తమీర – కొద్దిగా

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకోని ఆయిల్ వేడిచేసి అందులోకి ఆవాలు ,జీలకర్ర,తరిగిన ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి ,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక అందులోకి క్యాప్సికం ముక్కలు ,ఉప్పు వేసి మూతపెట్టి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి.
4.క్యాప్సికం ఉడికిన తర్వాత అందులోకి కారం వేసి గుడ్ల సొనను యాడ్ చేసుకోవాలి.
5.గుడ్లను కదపకుండా మూత వేసి ఉడికే వరకు కదిలించకూడదు.
6.లోఫ్లేమ్ పై ఎగ్ ని ఫ్రై చేసుకోని కొత్తిమీర చల్లుకుంటే క్యాప్సికం ఎగ్ ఫ్రై రెడీ.