Kitchenvantalu

రెస్టారెంట్ స్టైల్ స్పైసీ బేబీ పొటాటో మంచూరియన్.. బయట కొనే పనిలేకుండా ఇంట్లోనే ఈజీగా!

Baby Potato Manchurian:బంగాళదుంపలతో ఎప్పుడూ చేసుకునే ఫ్రై, కుర్మా కాకుండా కాస్త వెరైటీగా, స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే ఈ కారం కారంగా, ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో మంచూరియన్ (Baby Potato Manchurian) ని ట్రై చేయండి.

రెస్టారెంట్ కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా, పక్కా రెస్టారెంట్ రుచితో మన ఇంట్లోనే చాలా సులభంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడి వేడిగా ఇలా చేసి పెడితే ఒక్కటి కూడా మిగల్చకుండా లాగించేస్తారు. వీకెండ్స్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ స్టార్టర్ లేదా ఈవెనింగ్ స్నాక్ గా అద్భుతంగా ఉండే ఈ స్పైసీ బేబీ పొటాటో మంచూరియాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం!

బేబి పొటాటో మంచురీయన్.. పిల్లలకి స్నాక్స్ అంటే వెరైటీ గా ఉంటే తప్ప దాని వంక చూడరు. టేస్ట్ ఎలా ఉన్నా ముందుగా కాస్తా స్పెషల్ లుక్ మాత్రం ఎక్స్ పెక్ట్ చేస్తారు. బేబి పోటాటోస్ తో మంచురీయా తయారు చేసి చూడండి.వెరైటీగాను ,టేస్టీగాను ఉంటాయి.

కావాల్సిన పదార్ధాలు
బేబి పొటాటోస్ – 300 గ్రాములు
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
కారం – ½ టీ స్పూన్
పెప్పర్ పొడి – ¼ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 5-6
పచ్చిమిర్చి- 1
ఉల్లిపాయ – 1
సోయా సాస్ – 1 టీ స్పూన్
వెనిగర్ – ½ టీ స్పూన్
టొమాటో సాస్ – 1 టీ స్పూన్
కొత్తమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా బేబి పొటాటోస్ ని ప్రెజర్ కుక్కర్లో వేసి ఉప్పు యాడ్ చేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
2.ఉడికిన దుంపలను ఫోర్క్ తో కోతలు పెట్టాలి.
3.ఇప్పుడు బ్యాటర్ కోసం మిక్సింగ్ బౌల్ లోకి కార్న్ ఫ్లోర్ ,ఉప్పు,కారం,చిటికెడు మిరియాల పొడి,వేసి కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండని పొటాటో దుంపలపై చల్లుకోని మిక్స్ చేసుకోవాలి.
5.దుంపలకు పిండి పట్టుకునేలా టాస్ చేసుకోవాలి.

6.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం లేదా ప్యాన్ షాలో ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసి పొటాటోస్ వేపి పక్కన పెట్టుకోవాలి.
7.బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న పొటాటోస్ ని పక్కన పెట్టుకోవాలి.
8.ఇప్పుడు గ్రేవి కోసం బాండీలో ఆయిల్ వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు,ఉల్లిపాయ తరుగు,పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
9.వేరొక గిన్నెలోకి 1 ½ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి అందులోకి కారం,ఉప్పువేసి,నీళ్లతో కలుపుకోవాలి.
10.ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో టోమాటో సాస్ లు ,కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
11.గ్రేవిలోకి కొద్దిగా నీళ్లను కూడ యాడ్ చేసుకోవచ్చు.
12.రెడీ అయినా గ్రేవీలోకి కొత్తిమీర తరుగు,ప్రై చేసుకున్న పొటాటోస్ వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే..

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."