Kitchenvantalu

Telangana Special Corn Dosa:లేత మొక్కజొన్న గింజలతో ఇలాంటి దోశలు వేస్తే రుచి అదిరిపోతుంది

Corn Dosa:తెలంగాణ స్పెషల్ కార్న్ దోశ..రుచికి రుచి ఆరోగ్యాన్నిచ్చే కార్న్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
కార్న్ – 2 కప్పులు
పచ్చిమిర్చి – 5-6
జీలకర్ర – ½ టీ స్పూన్
ఉప్పు – 1 టీ స్పూన్
కొత్తిమీర – ½ కప్పు

తయారీ విధానం
1.మిక్సి జార్ లో కార్న్,జీలకర్ర,పచ్చిమిర్చి,ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
2. గ్రైండ్ చేసుకున్న పిండి ని గిన్నెలో కి తీసుకోవాలి.
3.ఇప్పుడు దోశ కన్ సిస్టెన్సీలా సరిపడా నీళ్లు యాడ్ చేసుకోవాలి.

4.కొత్తిమీర వేసుకోని బ్యాటర్ ని సిద్దం చేసుకోవాలి.
5.స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకోని వేడెక్కాకా నూనె వేసి ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి.
6.ఇప్పుడు గరిటడు కార్న్ బ్యాటర్ ని వేసి ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసుకోవాలి.
7.దోశ పై నెయ్యి కాని ,నూనె కాని వేసి లోఫ్లేమ్ పై దోశ క్రిస్పిగా అయ్యే వరకు వేపుకోవాలి.
8.అంతే వేడి వేడి కార్న్ దోశ రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."