Kitchenvantalu

Sorakaya Curry:సొరకాయ కూర ఇలాచేసి చూడండి ఒక ముద్ద ఎక్కువే తింటారు

Sorakaya Curry:సొరకాయ కర్రీ..సొరకాయ కూర ఇలాచేసి చూడండి ఒక ముద్ద ఎక్కువే తింటారు.. వాటర్ కంటెంట్ ఉన్న పదార్దాలు తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలోవాటర్ కంటెంట్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఉన్న సొరకాయ కర్రీ చపాతీ,రైస్,పుల్కా లోకి మంచి కాంబినేషన్. సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సొరకాయ – మీడియం సైజ్
పచ్చిమిర్చి – 7-8
ఉల్లిపాయ – 1
ఉప్పు – 1 ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
కొత్తిమీర – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా మసాలా కోసం మిక్సి జార్ లో పచ్చిమిర్చి ,కొత్తిమీర,జీలకర్ర,ఉప్పువేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.స
2.స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు మగ్గాక పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయే వరకు వేపుకోవాలి.
4.ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి ఉప్పు వేసుకోని మూత పెట్టి పది నిమిషాలు మగ్గించాలి.
5.ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసి అవసరం అయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి.
6.మూత వేసి రెండు ,మూడు నిమిషాలు మగ్గించుకుంటే సొరకాయ కర్రీ రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."