Dubbing Movies: రిపబ్లిక్ డేకు డబ్బింగ్ సినిమాల హోరు..మిస్ కాకండి
Dubbing Movies: రిపబ్లిక్ డే వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పండగ అయ్యాక రెండు తమిళ సినిమాలు, ఓ మలయాళ మూవీ.. తెలుగు డబ్బింగ్లో విడుదల కానున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. సంక్రాంతికి టాలీవుడ్లో హోరాహోరీ పోరు ఉండటంతో ఈ సినిమాలు విడుదలను వాయిదా వేసుకొని రిపబ్లిక్ డేకు వస్తున్నాయి.
అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం.. తెలుగులో జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది.
శివకార్తికేయ, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన కోలీవుడ్ సినిమా అయలాన్ తెలుగు వెర్షన్ జనవరి 26వ తేదీన విడుదల అవుతుంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
లిజో జోస్ పెలిసెరీ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన మలైకొట్టాయ్ వాలిబాన్ చిత్రం జనవరి 25వ తేదీన తెలుగులోనూ రిలీజ్ కానుంది. పీరియడ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు.
హృతిక్ రోషన్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘ఫైటర్’ జనవరి 25వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవడంపై ఇంకా స్పష్టత లేదు. అయితే, హిందీలో అయినా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంటుంది.


