MoviesTollywood news in telugu

Yevandoy Srimathigaru: 4 జీవితాలు, 2 కథలతో ఏవండోయ్ శ్రీమతిగారు..కొత్త సీరియల్..ఎప్పుడో..

Yevandoy Srimathigaru: తెలుగు చానల్స్ లో పోటాపోటిగా సీరియల్స్ వస్తున్నాయి. ప్రతి చానల్ లో సీరియల్స్ చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతి చానల్ అందరిని సీరియల్ ముందు కుర్చోనేలా చేస్తున్నాయి.

దాంతో కొత్త కొత్త సీరియల్స్ వస్తున్నాయి. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరరిస్తున్నారు. ఇక ఇప్పుడు జెమిని టివీలో “ఏవండోయ్ శ్రీమతిగారు” అనే సరికొత్త కథాంశంతో జనవరి 22 నుంచి ప్రసారం కానున్నది.

ఈ సీరియల్ సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ లో పల్లవి గౌడ, హర్షిత్ శెట్టి, మమ్మూటి శ్రీనివాస్, శాంతి, గుత్తి కొండ భార్గవ, దేవీశ్రీ, చైత్ర రాయ్, క్రిష్ణ వంటి నటులు నటిస్తున్నారు. ఈ సీరియల్ కూడా ప్రేక్షక అభిమానాన్ని పొందుతుందని ఆశిద్దాం.

పల్లవి గౌడ ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. పల్లవి గౌడ ఈ సీరియల్‌తో పాటు జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం ధారావాహికలో అరుంధతి పాత్రలో నటిస్తూ అలరిస్తుంది.