MoviesTollywood news in telugu

Neru ott release: గుడ్ న్యూస్.. తెలుగులోనూ ఓటీటీలోకి నేరు మూవీ..ఎక్కడ..ఎప్పుడు..?

Neru ott release: దృశ్యం మూవీ ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన Neru సినిమాలో మోహన్ లాల్, ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా మలయాళంలో గత నెలలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను మలయాళం,తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ తెలిపింది.

థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలుగులోనూ ఈ మూవీ రానుండటం నిజంగా గుడ్ న్యూసే.

అబ‌ద్దాల‌తో కేసు గెల‌వాల‌ని ప్ర‌య‌త్నించే లాయ‌ర్ ఓ వైపు…నిజం కోసం పోరాడే లాయ‌ర్ మ‌రోవైపు…ఒక‌రిపై మ‌రొక‌రు వేసే ఎత్తులు పై ఎత్తుల‌తో ఈ సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."