Keto Atta:ఈ పిండితో రోటి చేసుకుంటే బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు
Keto Atta:మనం సాదారణంగా గోధుమ పిండి,జొన్న పిండి,రాగి పిండి వంటి వాటితో రోటి లేదా చపాతీ చేసుకుంటూ ఉంటాం. అదే Keto Atta తో చేసుకుంటే బరువు తగ్గటమే కాకుండా డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. అంతేకాక అలసట,నీరసం లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది.
ఈ పిండిలో వేరుశెనగ, అవిసె గింజలు, చియా సీడ్, బాదం, పాలవిరుగుడు ప్రోటీన్ ఐసోలేట్, నువ్వులు, కొబ్బరి పొడి, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటివి ఎన్నో ఉంటాయి.
దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా మరియు నెమ్మదిగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి సహాయపడుతుంది.
ఈ పిండిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండుట వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ పిండి గ్లూటెన్ రహితంగా ఉంటుంది. Keto Atta ను online లో కొనుగోలు చేయవచ్చు.

