Kitchenvantalu

Oats Egg PanCake:టిఫిన్ కోసం పిల్లలకి బలాన్నిచ్చే అధిక పోషకాలున్న ఓట్స్ PanCake..

Oats Egg Pancake Recipe:ఓట్స్ ఎగ్ ప్యాన్ కేక్.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గాని ,ఈవినింగ్ స్నాక్స్ కి గాని పర్ ఫెక్ట్ గా సూటయ్యే ఎగ్ ప్యాన్ కేక్ ఓట్స్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
ఓట్స్ – ½ కప్పు
గుడ్లు -2
మిరియాల పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
పాలు – ½ కప్పు
ఉల్లిపాయలు – 1
క్యారేట్ తురుము – 1
టొమాటో – 1
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ విధానం
1.ముందుగా ఓట్స్ ని పౌడర్ చేసుకోవాలి.
2.ఓట్స్ పౌడర్ ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోని అందులోకి ఉప్పు,మిరియాల పొడి ,పాలు అవసరం అయితే కొద్దిగా నీళ్లను యాడ్ చేసి కలుపుకోవాలి.
3.మిశ్రమంలోకి గుడ్లను పగుల కొట్టి కలుపుకోవాలి.
4.అందులోకి ఉల్లిపాయలు ,క్యారేట్ ,టమాటో తరుగు ,కొత్తిమీర,కరివేపాకు వేసి కలుపుకోవాలి.
5.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని టీ స్పూన్ ఆయిల్ వేసి వేడిచేసి రెండు,మూడు స్పూన్ల ఓట్స్ గుడ్డు మిశ్రమాన్ని వేసి మూత పెట్టుకోవాలి.
6.మీడియం ఫ్లేమ్ పై రెండు ,మూడు నిమిషాలు ఉడికించి అంచులకు నూనే వేసుకోని దోరగా కాల్చుకుంటే ప్యాన్ కేక్ రెడీ.