Beauty TipsKitchenvantalu

Face Glow Tips:పెరుగు +శనగపిండి..ఎప్పటిలా కాకుండా ఇలా ట్రై చేస్తే.. ఎంత ఎండలో తిరిగిన మీ ముఖం నల్లబడదు

Besan Face Glow Tips:పెరుగు +శనగపిండి..ఎప్పటిలా కాకున ఇలా ట్రై చేస్తే.. ఎంత ఎండలో తిరిగిన మీ ముఖం నల్లబడదు..చర్మ సంరక్షణలో ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే మంచి పలితాన్ని పొందవచ్చు. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది.

మనలో చాలా మంది ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా అనుకోవటం కూడా సహజమే. ముఖం కాంతివంతంగా మారటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటిలో సులభంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త శ్రద్ద, సమయాన్ని కేటాయిస్తే చాలు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ రోజ్ వాటర్, పావు స్పూన్ అనాసపువ్వు పొడిని వేసి బాగా కలిపి ముఖానికి రాసి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే సరిపోతుంది.

అనాసపువ్వు అనేది మనలో చాలా మందికి మసాలా దినుసుగా మాత్రమే తెలుసు. ఇది చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. చర్మం మీద ముడతలు లేకుండా బిగుతుగా ఉండేలా చేయటమే కాకుండా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మొటిమలు,నల్లని మచ్చలను తగ్గిస్తుంది.

అనాసపువ్వులో అనెథోల్ ఉంటుంది, ఇది చర్మాన్ని నిర్విషీకరణ చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేయడం ద్వారా, చర్మాన్ని టోన్ చేయడంలో సహాయపడే టానిన్లు కూడా ఇందులో ఉన్నాయి.కణజాలంలోకి చొచ్చుకుపోయి ముడతలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."