Kitchenvantalu

Kitchen Tips:మీరు మెచ్చే, మీకెంతగానో పనికొచ్చే వంటింటి చిట్కాలు

Kitchen Tips in telugu : వంటింటిలో కొన్ని చిట్కాలను ఫాలో అయితే వంట తొందరగా అవ్వటమే కాకుండా మంచి రుచిగా కూడా వస్తుంది. వంటింటిలో కొన్ని చిట్కాలను పాటిస్తే పని సులువుగా అయ్యిపోతుంది. ఈ చిట్కాల కోసం స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా మాగజైన్ లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే చాలా ప్రయోజనం కలుగుతుంది.

సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు ఉడికిన సగ్గుబియ్యం లో కొంచెం మజ్జిగ కలిపితే వడియాలు తెల్లగా రావటమే కాకుండా మంచి రుచిగా ఉంటాయి. మనలో చాలా మందికి saggubiyyam vadiyalu పెట్టినప్పుడు ఈ సమస్య వస్తుంది.

సాయంత్రం సమయంలో మిరపకాయ బజ్జీలు వేసుకుంటూ ఉంటాం. మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు శనగపిండిలో రెండు చెంచాల నెయ్యి కలిపితే బజ్జీలు కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

కోడిగుడ్లు తాజావో కాదో తెలుసుకోవాలంటే చల్లని నీళ్లల్లో ఉప్పు కలిపి అందులో కోడిగుడ్లను వేస్తే మునిగినవన్నీ తాజా గుడ్లు తేలినవన్నీ పాత లేదా పాడిన గుడ్లని అర్థం. గుడ్డు తెచ్చిన ప్రతి సారి ఇలా చేస్తే మంచిది.

టమాటా రసం ఒకేసారి తీసి ఐస్టీలో వేసి ఫ్రీజర్ లో పెడితే ఒక వారం వరకు బాగుంటుంది కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు. టమోటాలు అందుబాటులో లేనప్పుడు బాగా ఉపయోగపడుతుంది.

చలికాలంలో గోరువెచ్చని పాలలో తోడు వేసి ఆ గిన్నె మీద మూత పెట్టి కుక్కర్లో అడుగున నీరు పోసి ఈ గిన్నెను ఉంచి మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తరువాత తీసి బయట పెడితే త్వరగా పెరుగు తోడుకుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."