Smart Yoga Mat:యోగా గురువు అవసరం లేకుండా వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్..
Smart Yoga Mat:యోగా గురువు అవసరం లేకుండా వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్..సాదారణంగా యోగా మ్యాట్ లు రకరకాల రంగులు,డిజైన్స్ లలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు యోగ మ్యాట్ స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.
ఈ మ్యాట్ వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్లా పనిచేస్తుంది. ఇది ఏఐతో రూపొందించడం వల్ల ఆప్‌తో అనుసంధానమై ఉంటుంది. ఒక ఆసనాన్ని ఎలా వేయాలో చెప్పటమే కాకుండా సరిగ్గా వేయకపోతే.. తప్పును వివరించి ఎలా చేయాలో చెప్పుతుంది.
ప్రతిరోజూ వేసిన ఆసనాల తాలుకూ హిస్టరీ కూడా దీనిలో రికార్డ్ అవుతుంది. బరువును కూడా చూసుకోవచ్చు. ఫోనూ, ట్యాబూ, స్మార్ట్వాచీనీ అనుసంధానం చేసుకునే ఈ మ్యాట్ కేబుల్, మొబైల్ స్టాండ్‌తో కలిపి వస్తుంది. అప్పుడప్పుడూ ఛార్జింగ్ చేసుకుంటే ఒక వ్యక్తిగత ఫిట్నెస్ గురు మన వెంట ఉన్నట్లే.
మరి ఇక ఆలస్యం ఎందుకు వెంటనే online లో ఆర్డర్ పెట్టేయండి.

