Beauty Tips

Skin Care Tips: మీ మెడ చుట్టూ నలుపు వెంటనే పోవాలంటే ఇలా చేయండి చాలు..

Skin Care Tips: మీ మెడ చుట్టూ నలుపు వెంటనే పోవాలంటే ఇలా చేయండి చాలు.. కొంతమందికి మెడ మీద చర్మం నల్లగా ఉంటుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మార్కెట్ లో దొరికే క్రీమ్స్ వాడటం కన్నా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో మెడను తెల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.

గుప్పెడు వేప ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ లో కొంచెం పసుపు కలిపి మెడ మీద నలుపు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు ఇలా చేస్తే సరిపోతుంది. ప్రతి రోజు ఇలా చేస్తే క్రమంగా మెడ మీద ఉన్న నలుపు తొలగిపోతుంది.
ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

వేపాకు,పసుపులో ఉండే లక్షణాలు చర్మం మీద నలుపును తొలగించటానికి సహాయపడటమే కాకుండా చర్మం పొడిగా లేకుండా చేస్తుంది. చర్మం మీద దద్దుర్లు,దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వేపాకు చాలా సులభంగానే దొరుకుతుంది. ఒకవేళ వేపాకు దొరక్కపోతే మార్కెట్ లో దొరికే వేప పొడిని వాడవచ్చు.

ఈ పేస్ట్ జుట్టు సమస్యలకు కూడా బాగా పని చేస్తుంది. ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. వేప,పసుపులను పురాతన కాలం నుండి వాడుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."