Beauty Tips

White Hair Turn Black:ఇది ఒకే ఒక్కసారి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది…

White Hair Turn Black:ఇది ఒకే ఒక్కసారి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది…తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే రావటం వలన చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం ముందుగా ఇనుప మూకుడు తీసుకొని దానిలో ఒక కప్పు హెన్నా పొడి వేసి దానిలో గోరువెచ్చని నీరు పోసి బాగా కలిపి రాత్రంతా అలా వదిలేయాలి. సమయం ఎక్కువగా లేనివారు కనీసం రెండు గంటలు అయినా అలా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం హెన్నా నలుపు రంగులోకి మారుతుంది. ఒక్కసారి హెన్నా పేస్ట్ ని బాగా కలిపి పక్కన పెట్టాలి.

ఇక ఒక కప్పు హెన్నా పొడికి నాలుగు కప్పుల ఇండిగో పొడిని తీసుకోవాలి. ఒక బౌల్ లో ఇండిగో పొడి వేసి దానిలో వేడి నీరు పోసి బాగా కలిపి అరగంట అలా వదిలేసి ఆ తర్వాత ఇండిగో పేస్ట్ ని హెన్నా పేస్ట్ లో వేసి బాగా కలిపి పది నిమిషాలు అయ్యాక జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి cap పెట్టుకోవాలి.

మూడు గంటలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని మరుసటి రోజు షాంపూ లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా చుండ్రు,దురద వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."