Beauty Tips

Hair care Tips:కొబ్బరి నూనెలో వీటిని కలిపితే జుట్టు ఊహించని విధంగా పెరుగుతుంది

Hair care Tips:కొబ్బరి నూనెలో వీటిని కలిపితే జుట్టు ఊహించని విధంగా పెరుగుతుంది.. జుట్టు రాలే సమస్య,జుట్టు చివర్లు చిట్లటం, జుట్టు ఎదుగుదల లేకపోవటం వంటి సమస్యలు ఇప్పటి రోజుల్లో సర్వ సాధారణం అయ్యిపోయాయి. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఒక పాన్ లో ఒక స్పూన్ మెంతులు,ఒక స్పూన్ లవంగాలను వేసి బాగా వేగించాలి. బాగా వేగాక 50 ml కొబ్బరి నూనె వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఈ నూనె చల్లారాక మెంతులు,లవంగాలను అలా ఉండగానే సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజు రాసుకుంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

మెంతులు తల మీద రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. లవంగాలు దురద,చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం. ఈ నూనెను ప్రతి రోజు రాసినప్పుడు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. ఈ నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."