సొరకాయ కూర వద్దనే వారు కూడా లొట్టలేసుకుని తినేలా.. ఈ రెసిపీ ట్రై చేయండి!
Bottle Gourd Curry:నిజం చెప్పాలంటే.. మా ఇంట్లో సొరకాయ తెచ్చిన ప్రతిసారీ ఒకటే డైలాగ్.. ‘మళ్లీ ఇదే కూరా?’ అని. మీ ఇంట్లో కూడా పరిస్థితి ఇంతేనా? అయితే ఒక్కసారి నేను చెప్పే ఈ చిన్న మార్పులు చేసి కూర వండి పెట్టండి. నిన్నటి దాకా వంకలు పెట్టిన వాళ్లే, ‘కూర భలే ఉందే, ఇంకొంచెం వెయ్యి’ అని అడిగి మరీ తింటారు.
పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, మన పోపుల పెట్టెలో ఉండే వాటితోనే అద్భుతమైన రుచి తీసుకురావచ్చు. వేడి అన్నంలోకి ఈ కమ్మని సొరకాయ కూర కలుపుకొని తింటుంటే.. ఆ మజాయే వేరు. మరి ఆ సీక్రెట్ రెసిపీ ఏంటో చూసేద్దామా!
సొరకాయ కూర ఇలా చేసి చూడండి… ఒక ముద్ద ఎక్కువే తింటారు.. రుచి సూపర్.. సొరకాయతో సాంబార్ , సొరకాయతో రోటి పచ్చడి టేస్ట్ చేసే ఉంటారు.
సాధారణంగా అందరు అవ్వే చేస్తుంటారు. కాని కొబ్బరిపాలతో సొరకాయ పచ్చడి చేసారంటే మీ వీక్లి మెనులో రెండు మూడు సార్లైనా ఈ పచ్చడిని యాడ్ చేస్తారు. మరి సొరకాయ కొబ్బరి పాలపచ్చడి ఎలా తయారు చెయ్యాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
సొరకాయ ముక్కలు – ½ కిలో (లేతది, తొక్కు తీసినవి)
పెరుగు- ½ కప్పు
చిక్కటి కొబ్బరి పాలు -300 ml
పచ్చిమిర్చి- 5-6
కరివేపాకు-2 రెమ్మలు
ఉప్పు-తగినంత
నూనె- 1 టేబుల్ స్పూన్
ఆవాలు- ½ టీ స్పూన్
మినపప్పు-½ టీ స్పూన్
జీలకర్ర-½ టీ స్పూన్
ఎండుమిర్చి- 2
తయారీ విధానం
1.ముందుగా ఒక బాండీలో పెరుగు వేసుకుని, ¼ లీటర్ వరకు నీళ్లు వేసుకుని, పల్చని మజ్జిగలా తయారు చేయాలి.
2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బాండీ పెట్టుకుని, అందులోకి సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి , ఉప్పు, వేసి కలుపుకుని, మూత పెట్టి, మజ్జిగ ఆవిరి అయిపోయేవరకు ఉడికించాలి.
4. సొరకాయ ముక్కలు ఉడికించి, ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, అందులోకి జీలకర్ర , ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకుని, తయారు చేసుకున్న తాళింపును, సొరకాయ కొబ్బరి పాల కూరలో మిక్స్ చేసుకోవాలి.
5. అంతే కర్రీ రెడీ అయిపోయినట్లే!

