Beauty Tips

White Hair:కొబ్బరి నూనెలో ఈ ఆకును మరిగించి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది

White Hair:కొబ్బరి నూనెలో ఈ ఆకును మరిగించి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.. ఏ సమస్య వచ్చినా ముందుగా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. తెల్లజుట్టు వచ్చినప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ప్రయత్నం చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేస్తారు. ఆ ఉత్పత్తుల కారణంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే సరిపోతుంది.

మనం రెగ్యలర్ గా ప్రతి రోజు ఉపయోగించే కొబ్బరి నూనె,కరివేపాకును ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ బి మరియు బీటా-కెరాటిన్‌తో జుట్టు కుదుళ్లలో మెలమైన్ వర్ణద్రవ్యంను పునరుద్ధరన చేయటానికి సహాయపడుతుంది. దాంతో తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు కూడా తెల్లజుట్టును నల్లగా మార్చుతాయి. ఒక గిన్నెలో కరివేపాకు, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని బాగా మరిగించి మిశ్రమం నల్లగా మారే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి నిల్వ చేసుకోవాలి.

ఈ నూనెను జుట్టు మరియు తలపై మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి పలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."