Hair Growth Tips: ఈ ఆయిల్ తో ఇలా చేస్తే చాలు జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలదు
Hair Growth Tips: ఈ ఆయిల్ తో ఇలా చేస్తే చాలు జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలదు.. జుట్టు సమస్యలకు ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. ఈ సీజన్లో ఎక్కువగా జుట్టు రాలే సమస్య వేధిస్తూ ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పులు, తరచుగా వానల్లో తడవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. దాంతో జుట్టు రాలే సమస్య రాగానే చాలామంది కంగారు పడిపోయి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే ఆయిల్ ఈ సీజన్లో జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పే నూనె చాలా సులభంగానే లభ్యం అవుతుంది. కాస్త ఓపికగా ఈ నూనెను వాడితే సరిపోతుంది.
టీట్రీ ఆయిల్ జుట్టు సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఒక కప్పు కొబ్బరి పాలల్లో ఒక స్పూన్ టీట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.
టీట్రీ ఆయిల్ లో మాయిశ్చరైజింగ్ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన చర్మంలోనికి డీప్ గా చొచ్చుకుని పోయి, తలకు, జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. టీట్రీ ఆయిల్లో టెర్పినిన్ 4 అనే కంటెంట్ ఉంటుంది. ఇది తలలో మురికిని తొలగిస్తుంది. మూసుకుపోయిన రంద్రాలను శుభ్రం చేస్తుంది. చుండ్రుకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.
తలలో చర్మరంద్రాలు క్లియర్ అయిన తర్వాత, తలలో హెయిర్ ఫోలిసెల్స్ ఎటువంటి అంతరాయం జరగకుండా పెరగడం సులభం అవుతుంది. కాబట్టి ఈ ఆయిల్ ని ఉపయోగించి జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్యల నుండి బయట పడి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.