MoviesTollywood news in telugu

Anjala Zaveri:హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. టాలీవుడ్ విలన్‌..

Anjala Zaveri:హీరోయిన్ అంజలా జవేరీ భర్త మనకు తెలిసిన నటుడే.. టాలీవుడ్ విలన్‌.. తెలుగులో ఒకప్పుడు అంజలా జావేరి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె హిందీ రంగంలో మొదట సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన, అక్కడ పెద్దగా క్రేజ్ రాలేదు. దాంతో ఆమె చూపు టాలీవుడ్ మీద పడింది.

తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో తెలుగులో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. నాగార్జున,బాలకృష్ణ వంటి హీరోలతో జోడి కట్టిన ఆమెకు అనుకున్నంత క్రేజ్ రాలేదు.

ఆమెకు అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక పాత్ర పోషించింది. అదే తెలుగులో చివరి సినిమా.

ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె ‘తరుణ్ అరోరా’ ను వివాహం చేసుకుంది. అతను కూడా హిందీ, తమిళ్ లో చాలా సినిమాల్లోనే నటించారు.

చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెం. 150 , పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు రెండు సినిమాల్లోనూ విలన్ గా నటించాడు. ఈ సినిమాల్లో మంచి పేరు సంపాదించాడు.

ఆయన జయ జానకి నాయక సినిమాలో కూడా విలన్ గా నటించాడు. తరుణ్ తన కెరీర్ ని 1999 లో ప్రారంభించిన ఖైదీ నెం. 150 తో బ్రేక్ వచ్చిందనే చెప్పాలి.పెళ్లి తరువాత అంజలా జవేరి నటనకు దూరమైంది. ఆమె భర్త మాత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."