White Hair:కలర్స్ ఎందుకు దండగ.. ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది
White Hair:కలర్స్ ఎందుకు దండగ.. ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది .. మారిన పరిస్థితి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య ఎక్కువగా వస్తుంది.
ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే చాలామందికి తెల్ల జుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది. తెల్ల జుట్టు సమస్య రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఒక గిన్నెలో గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టాలి దీనిలో రెండు స్పూన్ల టీ పొడి వేసి డికాషన్ వచ్చే వరకు మరిగించాలి అందులో ఒక స్పూన్ కలోంజి పౌడర్ ఒక స్పూన్ ఉసిరికాయ పౌడర్ ఒక స్పూన్ ఎర్రమందారం పౌడర్, 6 స్పూన్ల బృంగ్రాజ్ పౌడర్ వేసి బాగా కలిపి కొంచెం సేపు మరిగించాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టును పాయలుగా విడదీసి జుట్టు అంతా పట్టేలా గా పట్టించాలి ఆ తర్వాత వెనక్కి దువ్వుకుని ఈ మిశ్రమం అంతా జుట్టుకు బాగా పడుతుంది. అరగంటయ్యాక తేలికపాటి షాంపూ లేదా హెర్బల్ షాంపు ఉపయోగించి తలస్నానం చేయాలి.
ఈ చిట్కా కోసం ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి సహాయపడతాయి అంతేకాకుండా జుట్టు కుదుళ్లకు కావలసిన పోషణను అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


