Healthhealth tips in telugu

Onion And Tomato:ఉల్లిపాయ+టమోటా కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Onion And Tomato:ఉల్లిపాయ+టమోటా కలిపి తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా.. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

టమోటా,ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని విడిగా కాకుండా కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. ఉల్లిపాయ,టమోటా రెండింటినీ ఉడికించకుండా పచ్చిగానే తినవచ్చు. టమోటాలో యాంటీఆక్సిడెంట్ లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ కె సమృద్దిగా ఉంటాయి.

ఉల్లిపాయలో విటమిన్ సి మరియు అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. అంతేకాకుండా ఫోలేట్, పిరిడాక్సిన్ తో సహా B విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. టమోటాలు మరియు ఉల్లిపాయలు రెండూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవి రెండూ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

టొమాటోలలో ఉండే లైకోపీన్, మరియు క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్ ఉల్లిపాయలలో ఎక్కువగా ఉంటుంది. టమోటాలు మరియు ఉల్లిపాయలలో 25 రకాల ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు మరియు మధుమేహం వంటి వ్యాధులకు కారణమయ్యే ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధిస్తాయి.

కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటిల్లో ఫైబర్ మరియు ప్రీబయోటిక్స్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."