Hair Care Tips:విపరీతంగా జుట్టు రాలుతుందా.. ఉల్లిపాయతో ఇలా చేస్తే సరి..
Hair Care Tips:విపరీతంగా జుట్టు రాలుతుందా.. ఉల్లిపాయతో ఇలా చేస్తే సరి.. జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.
ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది. వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, మారిన జీవన శైలి వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది.
ఈ సమస్యను తగ్గించుకోవడానికి రక రకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ప్రయోజనం కనపడక చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ రెమెడీ కోసం 10 రేక మందార పువ్వులను తీసుకుని ఒక గిన్నెలో వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి.
మరుసటి రోజు ఉదయం నానబెట్టిన మందార పువ్వులను నీటితో సహా పొయ్యి మీద పెట్టి రెండు నిమిషాలు పాటు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ లవంగాలు ,ఒక స్పూన్ మెంతులు,ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.
ఒక గంట అయ్యాక .కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా నల్లగా పొడవుగా పెరుగుతుంది. మందార పువ్వులు జుట్టు సంరక్షణలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.
మెంతులలో ఉన్న లక్షణాలు చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. లవంగాలు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ జుట్టు రాలే సమస్యను తగ్గించి కొత్త జుట్టు రావడానికి సహాయపడుతుంది. చుండ్రు., దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.