Beauty Tips

Skin Glow Tips: రోజ్ వాటర్ లో వీటిని కలిపి ముఖానికి రాస్తే మచ్చలు,మొటిమలు మాయం

Skin Glow Tips: రోజ్ వాటర్ లో వీటిని కలిపి ముఖానికి రాస్తే మచ్చలు,మొటిమలు మాయం.. అందం కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో ముఖాన్ని తెల్లగా మేరిపించుకోవచ్చు.

ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం పట్ల శ్రద్ద పెడుతున్నారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టేస్తున్నారు.

మన ఇంటిలో సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా చేసుకోవచ్చు. ఈ చిట్కా కోసం రోజ్ వాటర్, తేనే.. కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

ఒక బౌల్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, అరస్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 5 నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి పలితాన్ని పొందవచ్చు.

తేనేలో ఉన్న పోషకాలు చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు చర్మాన్ని రిపేర్ చేసి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

తేనే ఆర్గానిక్ తేనే అయితే మంచిది. అలాగే రోజ్ వాటర్ మార్కెట్ లో దొరుకుతుంది. లేదంటే ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. ఈ చిట్కా మొటిమలు,మచ్చలు అన్నింటిని తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.