Beauty Tips

Face Glow Tips:నల్ల ఉప్పుతో ఇలా చేస్తే నిమిషాల్లో నల్లని ముఖం తెల్లగా మెరుస్తుంది

Face Glow Tips:నల్ల ఉప్పుతో ఇలా చేస్తే నిమిషాల్లో నల్లని ముఖం తెల్లగా మెరుస్తుంది.. నల్ల ఉప్పులో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ముఖ సంరక్షణలో మన వంటింటిలో ఉండే ఎన్నో వస్తువులు సమర్ధవంతంగా సహాయపడతాయి. అయితే వాటి గురించి మనకి తెలియక పెద్దగా పట్టించుకోము.

మనం ప్రతి రోజు వంటల్లో తెల్ల ఉప్పు వాడుతూ ఉంటాం. కొంతమంది నల్ల ఉప్పును ఉపయోగిస్తూ ఉంటారు. తెల్ల ఉప్పుతో పోలిస్తే నల్ల ఉప్పులో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. అయితే నల్ల ఉప్పును ఉపయోగించి ముఖం మీద ముడతలు,మొటిమలు వంటి అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.

నల్ల ఉప్పు ముఖం మీద ఉన్న దుమ్ము,ధూళి,అదనంగా ఉన్న నూనెను తొలగించటమే కాకుండా చర్మానికి అద్భుతమైన క్లెన్సర్‌గా పని చేస్తుంది. ఇది రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి మరియు లోతైన మురికిని తొలగించడానికి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను ప్రోత్సహించి తద్వారా ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ నల్ల ఉప్పు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్,ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం వస్తుంది.

ముఖం మీద ఉన్న మొటిమలు,ముడతలు,బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వంటివి అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల ఉప్పు ఆయుర్వేదం షాప్ లలోనూ,Online stores లోనూ లభ్యం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."