Kitchenvantalu

Perugu Pachadi: పెరుగు పచ్చడి రెసిపీ..చాలా సింపుల్, అద్భుమైన రుచి

Perugu Pachadi: పెరుగు పచ్చడి రెసిపీ..చాలా సింపుల్, అద్భుమైన రుచి..పెరుగు పచ్చడి..మొదటి ముద్ద పచ్చడి తో మొదలెట్టి ఆకరిముద్ద మజ్జికతో ముగిస్తేనే భోజనం సంపూర్ణంగా అనిపిస్తుంది.చప్పని మజ్జికకి కాస్తా ఘాటు తగిలించి అల్లంతో పెరుగు పచ్చడి ట్రైచేయండి అన్ని సీజన్స్ కి ఆల్ రౌండర్ లా పనిచేస్తుంది.

కావాల్సిన పధార్ధాలు
మెంతులు-1 టీ స్పూన్
కరివేపాకు-1 రెమ్మ
అల్లం- 2 ఇంచులు
పచ్చిమిర్చి-2
తురిమిన కొబ్బరి- 1 కప్పు
పసుపు-1/2 టీ స్పూన్
ఉప్పు –రుచికి సరిపడ
నూనె -2 టీ స్పూన్స్
ఆవాలు-1 టీ స్పూన్
మినపప్పు-1 టీ స్పూన్
ఎండు మిర్చి-1
ఇంగువ-చిటికెడు
జీలకర్ర-1/2 టీ స్పూన్
పెరుగు-1 కప్పు
కొత్తిమీర- కొద్దిగా

తయారి విధానం

1.ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులను వేసి దోరగా వేయించుకోవాలి.అందులోకి కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి పచ్చిదనం పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి.
2.ఇప్పుడు ఒక మిక్సీజార్ లోకివేయించిన మెంతులు కరివేపాకు తోపాటుగా అల్లం ముక్కలను,పచ్చిమిర్చి ముక్కలు కొబ్బరి పసుపు తగినంత ఉప్పు వేసుకోని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోని అందులోకి ఆవాలు ,జీలకర్ర,మినపప్పు ,ఎండుమిర్చివేసి పోపు వేగాక గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ను తాలింపులోకి ఆడ్ చేసుకోవాలి.
4.అల్లం పేస్ట్ ని రెండు నిమిషాలపాటు బాగా కలుపుకోవాలి.
5.ఇప్పుడు మజ్జిగ కోసం కొద్దిగా నీళ్లు కలుపుతు పెరుగును బీట్ చేసుకోని మెత్తని క్రీమ్ లా తయారు చేసుకోని తాలింపు వేసుకున్న అల్లం ముద్దను పెరుగులో వేసుకోని బాగా కలుపుకోవాలి.
6.ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీరను చల్లుకోని అన్నంలోకి సర్వ్ చేసారంటే రుచి అదిరిపోతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."