Healthhealth tips in telugu

Cool Drinks:కూల్ డ్రింక్స్ మన శరీరానికి చేసే హాని గురించి తెలుసా…

Cool Drinks:కూల్ డ్రింక్స్ మన శరీరానికి చేసే హాని గురించి తెలుసా… కూల్ డ్రింక్ లను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తాగుతారు. అయితే వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటే తాగటం మానేస్తారు.

సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా కూల్ డ్రింక్ ఇస్తూ ఉంటాం. కూల్ డ్రింక్ త్రాగటం వలన అప్పటికి ఏమి కాదు కానీ, లాంగ్ రన్ లో మాత్రం మన శరీరానికి హాని జరుగుతుంది. కూల్ డ్రింక్ వలన శరీరానికి కలిగే హాని గురించి తెలుసుకుందాం.
cool drinks
1. కూల్ డ్రింక్ లో దాదాపుగా 10 స్పూన్ల చక్కెర ఉంటుంది. మాములుగా ఇంత చక్కెర తీసుకుంటే వాంతులు అవుతాయి. కానీ డ్రింక్ లో ఫాస్పోరిక్ ఆమ్లం ఉండుట వలన వాంతులు అవ్వవు.

2. కూల్ డ్రింక్స్ వల్ల షుగర్స్ లెవల్స్ బాగా పెరిగిపోతుంది. దాంతో అది కొవ్వుగా మారి బరువు బాగా పెరుగుతాం.

3.కూల్ డ్రింక్స్ లో వుండే కెఫిన్ కారణముగా రక్త పోటు పెరుగుతుందట.

4.కూల్ డ్రింక్స్ వల్ల మూత్ర విసర్జన తో పాటు, డీహైడ్రేషన్ , దాహాం ఎక్కువగా వేస్తుంది.

5.కూల్ డ్రింక్స్ వల్ల శరీరంలో కాల్షియం లెవల్స్ బాగా తగ్గిపోయి ఎముకల సాంద్రత తగ్గుతుంది.
cool drink
6. మధుమేహాం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

7.లివర్, గుండె సంబధిత వ్యాదులకు కారణాలలో కూల్ డ్రింక్స్ ఒకటి.

కూల్ డ్రింక్స్ తాగటం వలన మన శరీరానికి హాని కలుగుతుంది. కానీ ఈ వేసవిలో కూల్ డ్రింక్స్ తాగటానికి బదులు పండ్ల రసాలు తాగటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."