MoviesTollywood news in telugu

Bindaas movie :బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..?

Bindaas movie :మంచు మోహన్ బాబు వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ చాలా తక్కువ సమయంలోనే తన ప్రత్యేక గుర్తింపును పొందాడు. తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ మాత్రమే కాదు, కామెడీలోనూ కూడా అభిమానులను మెప్పించాడు. అలాంటి సినిమాలలో ‘బిందాస్’ ఒకటి, ఇది 2010లో ఏకై ఎంటర్ టైనర్ బ్యానర్ కింద వీరూ పోట్ల దర్శకత్వంలో విడుదలైంది.

‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి చిత్రాలకు కథ అందించిన వీరూకి ఇది దర్శకుడిగా మొదటి చిత్రం. ఈ కామెడీ యాక్షన్ చిత్రం ఒక బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఇందులో నటించారు. మొదట మనోజ్ ఆమెను ప్రేమిస్తాడు, కానీ ఆమె అతన్ని వద్దని మరొకరిని వివాహమాడుతుంది.

మంచు మనోజ్‌కు జోడీగా ముంబయి భామ షీనా షహబాది నటించిన విషయం తెలిసిందే. గిరిజగా తన నటనతో మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, తల్లి సాధనా సింగ్ బాటలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ‘తేరే సంగ్’ చిత్రంతో నటనా ప్రస్థానం ఆరంభించింది. ఆమె తొలి తెలుగు చిత్రం ‘బిందాస్’ తో పాటు, ‘తొలిసారిగా’, ‘నందీశ్వరుడు’, ‘యాక్షన్ త్రీడీ’, ‘నువ్వే నా బంగారం’, మరియు ‘రాజశేఖర్ గడ్డం గ్యాంగ్’ వంటి చిత్రాల్లో నటించింది. 2015 తర్వాత ఆమె టాలీవుడ్‌కి దూరమైంది.

సినిమాలకు ఎంట్రీ ఇవ్వకముందు ఈ భామ వివాహం చేసుకోవడం విశేషం. 2007లో వైభవ్ గోరేను ఆమె వివాహమాడింది, అదే సంవత్సరంలో విడాకులు తీసుకుంది. ఒక ఇంటర్వ్యూలో షీనా తన జీవితంలో జరిగిన అతిపెద్ద పొరపాటుగా దాన్ని పేర్కొంది. ఆ ఘటన తర్వాత ఆమె సినీ కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో కనిపించకపోయినా, హిందీ టీవీ సిరీస్‌లలో నటించింది.

‘బిగ్ ఎఫ్’, ‘ప్యార్ తునే క్యా కియా’ వంటి షోలలో మెరిసింది. కన్నడ చిత్రం ‘రాజధాని’లో యష్ సరసన నటించి, అది తెలుగులో ‘రాజధాని రౌడీ’గా డబ్ చేసారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తోంది ఈ భామ.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."