Nuvvostanante nenoddantana Movie:నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో నటించిన ఈ నటి ఇప్పుడు ఏమి చేస్తుందో..?
Nuvvostanante nenoddantana Movie:నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో నటించిన ఈ నటి ఇప్పుడు ఏమి చేస్తుందో.. సిద్దార్థ్, బాయ్స్ చిత్రంలో తన లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంతో ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇది ప్రభుదేవాకు దర్శకుడిగా మొదటి చిత్రం. 1989లో విడుదలైన ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) చిత్రం నుండి మూల కథను అనుసరించి, రైటర్ కమ్ డైరెక్టర్ వీరు పోట్ల దానిని స్థానిక నెటివిటీకి అనుగుణంగా మార్చారు.
2005లో సంక్రాంతి సమయంలో విడుదలైన ఈ చిత్రం ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎం.ఎస్. రాజు దీనిని నిర్మించారు. సిద్దార్థకు ఈ సినిమా మంచి హిట్ ని ఇచ్చింది. త్రిష పల్లెటూరి అమ్మాయిగా మరియు అన్న చాటు చెల్లెలిగా నటించి అభినందనలు పొందారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి వంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చిత్రానికి జీవం పోశారు.
శ్రీహరి ఇంట్లో పని చేసే అమ్మాయిగా నటించిన నటి సంతోషి కూడా తన కామెడీ పాత్రతో అలరించారు. జాగ్రత్త అనే పదం వినగానే చేతిలో ఉన్నవాటిని పడేసి నవ్వులు పంచే పాత్రలో నటి సంతోషి శ్రీకర్ నటించింది. ‘నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా’ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ హాస్య నటిగా నంది అవార్డు పొందింది.
ఆ సినిమా తర్వాత కొన్ని చిత్రాలు చేసి, వెండితెరకు దూరమైంది. ‘ఢీ’ చిత్రం తర్వాత తెలుగులో కనిపించని ఈ అందాల నటి. ఆమె ప్రముఖ సీనియర్ నటుడు ప్రసాద్ బాబుకు కోడలు. ఆయన కుమారుడు శ్రీకర్‌ను వివాహం చేసుకున్న సంతోషి, ప్లస్ బొటిక్ అండ్ బ్యూటీ లాంజ్ పేరిట బ్యూటీషియన్ కోర్సులను నిర్వహిస్తూ, చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్ నగరాల్లో బొటిక్స్ నడుపుతూ, బయట కూడా క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు.
అనేక మంది యువతులు మరియు మహిళలు ఆమెలా బ్యూటీషియన్‌గా మారాలని కోరుకుంటూ, ఆమె వద్ద శిక్షణ పొంది నిపుణులుగా మారారు. బ్రౌడల్ మరియు పార్టీ మేకప్, శారీ డ్రాపింగ్, హెయిర్ స్టైలింగ్ వంటి విషయాలలో ఆమె శిక్షణ ఇస్తుంది. ఆమె శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు ఆమెలాగే వ్యాపార రంగంలో ప్రవేశించి స్వయం ఉపాధి సాధిస్తున్నారు.
ఆమె విజయవాడలో జన్మించినా, తన తల్లి పూర్ణిమ ఒక సీరియల్ నటి కావడంతో చెన్నైలో పెరిగింది. సంతోషి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి, 2000లో ‘పెంగల్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, హీరోయిన్‌గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విజయవంతమైంది. ఆమె నవదీప్ హీరోగా నటించిన ‘జై’ సినిమాలో నటించి, ‘ఒక్కడే’, ‘బంగారం’, ‘ఢీ’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. వ్యాపార రంగంలో కొనసాగుతూనే, అప్పుడప్పుడు టెలివిజన్ రంగంలో కూడా మెరుగుదల చూపుతుంది.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ