MoviesTollywood news in telugu

Tollywood:ఈ బామ్మ గుర్తుందా.. నమ్మలేని నిజాలు మీ కోసమే…

Tollywood Actor rohini hattangadi:వెంకటేశ్ మరియు మహేష్ బాబు నటించిన మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో అంజలి మరియు సమంత హీరోయిన్లుగా నటించారు. 2013లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ఒక బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, రమా ప్రభ, ఆహుతి ప్రసాద్ వంటి స్టార్ కాస్ట్ నటీనటులు కూడా ఇందులో ప్రధాన పాత్రలు వహించారు.

వెంకీ, మహేష్ బాబులకు బామ్మగా నటించిన రోహిణీ గుర్తుందా? ‘హు.. సరిపోయారు ఇద్దరూ.. సాగుతుంది మీకలాగా’ అని ఇద్దరు మనవళ్లను ఉద్దేశించి ఆమె పలికిన డైలాగ్ పటాసులా పేలింది. మీమర్స్ ఇప్పుడు ఆ డైలాగ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. రోహిణీ ఈ సినిమాతో పాపులర్ అయ్యింది, కానీ ఆమె ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు.

మహారాష్ట్రలోని పూణెలో జన్మించిన ఆమె, నటనలో ఆసక్తితో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందారు. అక్కడే తన భర్త జయదేవ్ హట్టంగడిని కలిశారు. శిక్షణ పొందిన తర్వాత, వారు ఒక ఏడాదిలో వివాహం చేసుకున్నారు. జయదేవ్ డైరెక్షన్‌లో కూడా శిక్షణ పొందాడు. ఆమె నటనకు మాత్రమే కాకుండా, భారతీయ శాస్త్రీయ నృత్యాలు అయిన కథాకళి, భరతనాట్యంలో ఎనిమిది సంవత్సరాల పైగా శిక్షణ పొందారు.

వివాహం తర్వాత రోహిణీ ఒక నాటక సమాజం స్థాపించి, 150కి పైగా ప్రదర్శనలను ఇచ్చారు. ఆమె నాటక రంగంలో అనేక పురస్కారాలను పొందారు. 1978లో, ‘అరవింద్ దేవాయ్ కీ అజీబ్ దస్తాన్’ అనే హిందీ చిత్రంలో ఆమె తెరంగ్రేటం చేసారు. ‘గాంధీ’ చిత్రంలో ఆమె నటన ఆమెకు పేరు తెచ్చింది, మరియు హిందీ చిత్ర రంగంలో ఆమెకు మంచి పేరు వచ్చింది.

ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం, నాగేశ్వరరావు మరియు మీనా ప్రధాన పాత్రలుగా ఉన్న ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ చిత్రంలో, నాగేశ్వరరావు భార్య జానకమ్మ అనే పాత్రలో భర్తకు అడ్డుచెప్పని భార్యగా నటించారు. అమ్మమ్మ పాత్రలు వేయాల్సిన వయసులో తల్లి పాత్రలో నటించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘రాత్రి’ చిత్రంలో రేవతికి తల్లిగా నటించింది.

ఆమె తెలుగులో ‘లిటిల్ సోల్జర్స్’ చిత్రం తరువాత దాదాపు 15 ఏళ్ల పాటు తెలుగు సినిమా రంగంలో కనిపించలేదు. 2012లో ‘షిరిడీ సాయి’ సినిమాతో మళ్లీ రంగప్రవేశం చేసిన ఆమె, తరువాత వరుస చిత్రాలలో నటించారు. ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రంలో బేబి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించింది.

బ్రహ్మోత్సవం, చల్ మోహన్ రంగా, చిత్రలహరి మరియు ఇటీవల విడుదలైన ఫ్యామిలీ స్టోరీ చిత్రాలలో ఆమె నటించారు. అలాగే, ఇటీవల విడుదలైన మరాఠి చిత్రం ‘బైపన్ బారీ దేవ్’లో ఆమె ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. ఆ చిత్రం ఆరుగురు అక్కా చెల్లెళ్ల కథను చెప్పుతుంది, దీనికి విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. రోహిణీ గారి భర్త 2008లో మరణించారు, ఆమెకు అసీమ్ హట్టంగడి అనే కొడుకు ఉన్నారు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ