Kitchenvantalu

Biyyamlo Purugulu : బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా.. ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి..

Biyyamlo Purugulu : బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా.. ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి.. వంటగదిలో కొన్ని చిట్కాలను పాటిస్తే పని తొందరగా అవుతుంది.

ఒక్కోసారి బియ్యం ఎక్కువగా కొనేస్తూ ఉంటాం. అలాంటప్పుడు బియ్యం పురుగు పడుతుంది. ఈ సమస్య చాలా మందికి ఉంటుంది. ఈ సమస్యకు సులువైన చిట్కా ఉంది. అది ఏమిటంటే వేపాకులను ఎండబెట్టి పొడి చేసి మూట కట్టి బియ్యంలో వేయాలి. వేపాకులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండుట వలన పురుగులు బియ్యంలోకి చేరవు.

ఇంగువ ముక్క‌ల‌ను లేదా పొడిని చిన్న చిన్న మూట‌లుగా క‌ట్టి బియ్యం డబ్బాలో వేయాలి.ఇంగువ ఘాటు కారణంగా బియ్యానికి పురుగు పట్టదు. వెల్లుల్లి రెబ్బ‌ల పొట్టు తీసి బియ్యంలో ఉంచ‌డం వల్ల బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

బియ్యం పురుగుప‌ట్ట‌కుండా చేయ‌డంలో ల‌వంగాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయి. బియ్యంలో ల‌వంగాల‌ను ఉంచ‌డం వల్ల లేదా ల‌వంగాల పొడిని వస్త్రంలో క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల కూడా పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."