Kitchenvantalu

Tap Cleaning: కొళాయిలపై మొండి మరకలు పోవాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

Tap Cleaning: కొళాయిలపై మొండి మరకలు పోవాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. కుళాయిలను కొన్ని రోజులు వాడిన తర్వాత మొండి మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని తొలగించటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.

కుళాయిపై ఉప్పు నీటికి చెందిన మొండి మరకలను తొలగించడానికి వెనిగర్ లేదా నిమ్మకాయను ఉపయోగించవచ్చు. కుళాయిపై నిమ్మరసం లేదా వెనిగర్ స్ప్రే చేసి దాదాపు 20 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత బ్రష్ సహాయంతో కుళాయిని రుద్ది శుభ్రం చేస్తే కుళాయి తెల్లగా మెరిసిపోతుంది.

బేకింగ్ సోడాలో క్లీనింగ్ గుణాలు ఉండుట వలన ట్యాప్ పై మరకలను శుభ్రం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాలో సగం నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ట్యాప్ కు రుద్ది ఇరవై నిమిషాలు ఉంచండి. ఆ తరువాత కుళాయిని స్క్రబ్ సాయంతో రుద్ది శుభ్రం చేస్తే కుళాయిలపై ఉన్న మొండి మరకలు తొలగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ