Pani Puri:పానీపూరిని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే..
Pani Puri:పానీపూరిని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. ఈ విషయం తెలిస్తే.. ఈ మధ్య కాలంలో పానీపూరిని ఎక్కువగా తింటున్నారు. పానీపూరి తినే ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
పానీపూరి.. ఈ పేరు వినగానే మనకి నోరూరుతుంది. రోడ్డు ప్రక్కన కనపడే చాట్ బండారాలు, పానీపూరి, చాట్స్ తినటానికి మనం వెనుకాడము. పానీ పూరిని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.

బాగా నోరూరించే ఆ తినుబండారాలు తినే వారికి ఇది ఒక చేదు వార్త అనుకోవచ్చు. పానీపూరీలో ఎన్నో రకాల బాక్టీరియా, ఫంగస్ ఉన్నాయని వైద్యులు చేసిన పరీక్షల్లో తేలింది. చూడటానికి స్ట్రీట్ ఫుడ్ బాగానే వున్నా వాటిలో వాడుతున్న నీటిలో 45%, చట్నీతో 75% కాలుష్యకారకమైన ఈ-కోలి ఉంటుందని, ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని అంతే కాకుండా ఆరోగ్యం నెమ్మదిగా క్షిణిస్తుందని వైద్యులు తెలిపారు.

చాలా చోట్ల వెండర్లు పానీపూరి, చాట్స్ మనకి ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టి ఇస్తారు.అయితే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తినటం ప్రాణానికి కూడా హానికరమని వైద్యులు తెలిపారు. ఆ తినుబండారాలు తిన్నాక వాటిని పక్కనే పడవేస్తాము. శుభ్రత లేమి కారణంగా వాటిలో ఎక్కువగా ఫంగస్, బాక్టీరియా చేరుతుందని వైద్యులు చెబుతున్నారు.

శుభ్రత అనేది ఆ తినుబండారాలలో చాలా ముఖ్యమని కానీ చాలా బండ్ల దగ్గర శుభ్రత అనేది లోపిస్తుందని సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగా వుండాలని వైద్యులు సూచించారు. పానీ పూరీ అంటే ఇష్టం ఉన్నవారు ఇంటిలో తయారుచేసుకొని తింటే మంచిది. ఏదైనా సరే మనం ఇంటిలో తయారుచేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం…శుభ్రానికి శుభ్రం ఉంటుంది. ఆరోగ్యం కావాలంటే ఏదైనా సరే ఇంటిలో తయారుచేసుకోవటం బెస్ట్ అని చెప్పాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

