Kitchen Hacks: బట్టలపై పడ్డ టీ మరకలను ఇలా ఈజీగా తొలగించవచ్చు..
Kitchen Hacks: బట్టలపై పడ్డ టీ మరకలను ఇలా ఈజీగా తొలగించవచ్చు.. మనం ప్రతి రోజు కాఫీ,టీ తాగుతూ ఉంటాం. అలాంటప్పుడు అనుకోకుండా మన బట్టల మీద కాఫీ లేదా టీ మరకలు పడుతూ ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా తాగిన ఒక్కోసారి మరకలు పడటం తప్పదు. ఈ మరకలను తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
బ్లీచింగ్ పౌడర్ లో నీటిని కలిపి పేస్ట్ గా చేసి మరక పడిన బట్టలపై రాసి రుద్ది నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. అయితే బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా వాడకూడదు. ఎక్కువగా వాడితే బట్టలు తొందరగా పాడైపోతాయి. కాబట్టి కేవలం మరక పడిన చోట మాత్రమే బ్లీచింగ్ పౌడర్ వేసి రుద్దాలి.
వెనిగర్ కూడా టీ, కాఫీ మరకలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరకలు పడిన చోట వెనిగర్ వేసి బాగా రుద్ది సర్ఫ్ నీటిలో నానబెట్టి ఉతికితే సరిపోతుంది.
టీ పడిన వెంటనే టిష్యూ పేపర్ తో మరకలను తుడిచేసి సబ్బుతో రుద్ది బ్రష్ తో రుద్దితే మరకలు తొలగిపోతాయి. అయితే కేవలం మరకపడిన ప్రదేశంలో మాత్రమే సర్ఫ్ జల్లి కూడా శుభ్రం చేయవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

