Get Rid of Dandruff। తలలో చుండ్రు పోవాలంటే సులభమైన మార్గాలివిగో!
Get Rid of Dandruff। తలలో చుండ్రు పోవాలంటే సులభమైన మార్గాలివిగో.. తలలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే దీనిని నివారించటానికి ఇక్కడ సులభమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని ప్రయత్నించి చూడండి.
చుండ్రు,దురద వంటి సమస్యలు ఉన్నప్పుడు జుట్టు రాలే సమస్య కూడా వచ్చేస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.
తలలో దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం.
దీని కోసం ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లు,మాడు నుంచి కుదుళ్ల వరకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తలలో దురద,చుండ్రు, జుట్టు రాలే సమస్య తగ్గుతాయి.
పెరుగు తల మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా చేస్తుంది. శీకాయ జుట్టు రాలటం, చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఆలోవెరా మాడు మీద ఇన్ ఫెక్షన్ తగ్గిస్తుంది. చుండ్రు సమస్య,జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

