Face Glow Tips:బంగాళదుంప +కాఫీ పొడితో ఇలా చేస్తే నల్లని మచ్చలు,పిగ్మెంటేషన్ 7 రోజుల్లో మాయం
FAce Glow Tips:ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్ లేకుండా ముఖం కాంతివంతంగా మెరవడానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ముఖం మీద నల్లని మచ్చలు,పిగ్మెంటేషన్,మొటిమలు, ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండటమే కాకుండా యవ్వనంగా కూడా ఉంటుంది. ఈ రెమెడీని వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
ముందుగా బంగాళాదుంపలు తొక్క తీయకుండా తురిమి దాని నుంచి జ్యూస్ సపరేట్ చేయాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యప్పిండి, ఆర స్పూన్ కాఫీ పౌడర్, అర స్పూన్ అలోవెరా జెల్, అర స్పూన్ బాదం నూనె, రెండు స్పూన్ల బంగాళదుంప జ్యూస్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక సున్నితంగా రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
అలాగే వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమై చర్మం యవ్వనంగా ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాని ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. మనం ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియంట్స్ మనకు సులభంగా అందుబాటులో ఉండేవే. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

