Kitchen Tips:బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండాలంటే …. సింపుల్ చిట్కాలు
Biyyam purugu pattakunda Tips:సాధారణంగా మనం బియ్యం, పప్పులు ఎక్కువగా తెచ్చుకుని నిలువ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు వాటిని ఎంత జాగ్రత్తగా నిల్వచేసిన పురుగులు పట్టేస్తూ ఉంటాయి. అలా పురుగులు పట్టిన తర్వాత వాటిని శుభ్రం చేయడం కన్నా పురుగులు పట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది.
బియ్యం సంచిలో ఉండటం వలన తొందరగా పురుగు పడుతుంది. కాబట్టి బియ్యం తెచ్చిన వెంటనే గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. అలాగే డబ్బా మీద మూత ఎప్పటికప్పుడు వేస్తూ ఉండాలి.
మనలో చాలామంది బియ్యాన్ని వంటగదిలో నిలువ చేస్తూ ఉంటారు. అక్కడ వేడి ఎక్కువగా ఉండటం వల్ల పురుగు పట్టే అవకాశం ఉంది. కాబట్టి చల్లని వేడి లేని ప్రదేశంలో బియ్యాన్ని నిలువ చేయాలి.
బియ్యం కొనుగోలు చేసిన తర్వాత ఇంటికి తీసుకొస్తాం కదా.. అప్పుడు ఆ బియ్యాన్ని రెండు లేదా మూడు గంటల పాటు ఎండలో ఎండబెట్టాలి. ఈ విధంగా ఎండలో ఎండబెట్టడం వలన బియ్యంలో ఉండే తేమ పోతుంది.. కాబట్టి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.
బియ్యం డబ్బాలో నిలువ చేసినప్పుడు కొన్ని వేపాకులు లేదా లవంగాలు లేదా మిరియాలు వేసిన పురుగు పట్టకుండా ఉంటుంది..ఈ జాగ్రత్తలు పాటిస్తే బియ్యం ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

