Healthhealth tips in telugu

Weight Loss:ఈ డ్రింక్ తాగితే రెండు నెలల్లో దాదాపుగా 5 కేజీల బరువు తగ్గొచ్చు

Weight Loss Drink:ఈ డ్రింక్ తాగితే రెండు నెలల్లో దాదాపుగా 5 కేజీల బరువు తగ్గొచ్చు.. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరగడమే కాకుండా థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.

మంచి పోషకాహారం తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఇప్పుడే చెప్పిన డ్రింక్ తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఒక గిన్నెలో ఒక స్పూన్ ధనియాలు, అంగుళం అల్లం ముక్క, ఒక స్పూన్ సోంపు గింజలు, దాల్చిన చెక్క ముక్క, రెండు యాలకులు, రెండు కప్పుల నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించాలి.

ఈ విధంగా మరిగించడం వలన మనం తీసుకున్న పదార్థాల్లోని పోషకాలు అన్ని నీటిలోకి చేరుతాయి. ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా తాగటం వలన శరీరంలో మలినాలన్నీ తొలగిపోతాయి. అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయం సమయంలో ఈ డ్రింక్ తాగితే బరువు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ