Kothimeera Pachadi:కొత్తిమీర పచ్చడి ఇలా చేసి చూడండి ప్రతీ ముద్ద కమ్మగా తినేస్తారు
Kothimeera Pachadi:కొత్తిమీర పచ్చడి ఇలా చేసి చూడండి ప్రతీ ముద్ద కమ్మగా తినేస్తారు.. కొత్తిమీర అంటే కొంత మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కొత్తిమీర వాసన నచ్చదు. అటువంటి వారు ఇప్పుడు చెప్పే విధంగా పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
తయారీ విధానం
కావలసిన పదార్థాలు
– కొత్తిమీర – 2 కట్టలు (శుభ్రంగా కడిగి, ఆకులను వేరుచేయాలి)
– పచ్చిమిర్చి – 4-5
– ఎండుమిర్చి – 2-3
– చింతపండు – చిన్న నిమ్మకాయ సైజు (లేదా 1 టీస్పూన్ చింతపండు గుజ్జు)
– జీలకర్ర – 1 టీస్పూన్
– వెల్లుల్లి – 3-4 రెబ్బలు
– ఉప్పు – రుచికి సరిపడా
– నూనె – 2 టేబుల్ స్పూన్లు
– పోపు కోసం: ఆవాలు – 1/2 టీస్పూన్, మినపప్పు – 1 టీస్పూన్, జీలకర్ర – 1/2 టీస్పూన్, కరివేపాకు – కొన్ని, ఇంగువ – చిటికెడు
తయారి విధానం
కొత్తిమీరను శుభ్రంగా బాగు చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసిన కొత్తిమీరను శుభ్రంగా కడిగి నీరు అంతా పోయేలా ఒక బుట్టలో వాడేయాలి. ఒక పాన్లో ఒక స్పూన్ నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి మంచి వాసన వచ్చేలా వేయించాలి.
ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గించాలి. మగ్గిన కొత్తిమీరను చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయాలి. ఆ తర్వాత చింతపండు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేయాలి.
ఈ కొత్తిమీర పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక చిన్న పాన్లో ఒక స్పూన్ నూనె, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి పోపు చేయాలి. ఈ పోపు బాగా వేగాక మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలపాలి. ఇది అన్నం, ఇడ్లీ, దోస వంటి వాటికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఈ పచ్చడిలో ఇష్టమైతే కొంచెం నువ్వులను కూడా కలుపుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

