Lemon Storage Tips:నిమ్మకాయలు నెలరోజుల పాటు నిల్వ ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Lemon Storage Tips:నిమ్మకాయలు నెలరోజుల పాటు నిల్వ ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. వేసవి కాలంలో నిమ్మకాయలు చాలా తక్కువగా దొరుకుతాయి. దొరికినప్పుడే ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలి. వేసవిలో నిమ్మకాయలు చాలా తొందరగా ఎండిపోతూ ఉంటాయి. అలా కాకుండా తాజాగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.
నిమ్మకాయల వాడకం కూడా చాలా ఎక్కువే. నిమ్మకాయల నిల్వ చేయడానికి ఇప్పుడు చెప్పే పద్ధతి చాలా బాగా సహాయపడుతుంది. చేతిలో కొద్దిగా వంట నూనె రాసుకుని నిమ్మకాయలకు ఆ నూనెను బాగా రాసి గాలి చొరబడని డబ్బాలో నిలువ చేసి ఫ్రిజ్లో ఉంచితే దాదాపుగా నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీటిని ఉపయోగించడానికి ఒక అరగంట ముందు ఫ్రిజ్ నుంచి బయటికి తీస్తే రసం బాగా వస్తుంది.
నిమ్మరసం తీసి గాలి చొరబడని గాజు సీసాలో పోసి ఫ్రిజ్లో పెడితే నెల రోజులు వరకు నిల్వ ఉంటుంది.. లేదంటే ఐస్ క్యూబ్ లలో నిల్వచేసి ఫ్రీజర్ లో పెడితే అయిదు ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది.
నిమ్మకాయలను నిల్వ చేయడానికి నిమ్మకాయలను కట్ చేసి ఉప్పు రాసి గాజు సీసాలో ఉంచితే నిమ్మకాయ రసం అలానే ఉంటుంది. నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి.
సగం కప్పు వెనిగర్ సగం కప్పు నీటిలో కలిపి దానిలో నిమ్మకాయలను నిలువ చేస్తే నెల వరకు నిల్వ ఉంటాయి. నిమ్మకాయలు ఎండిపోయినట్టు అనిపిస్తే కొంచెం సేపు నీటిలో వేస్తే సరిపోతుంది. లేదంటే 30 సెకండ్స్ ఓవెన్ లో ఉంచితే వాటి నుంచి రసం బాగా వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

