Beauty Tips

Hair Growth Tips:జుట్టు సమస్యలకు చెక్కు పెట్టే ఫుడ్స్.. మీరు తింటున్నారా..

Hair Growth Tips:జుట్టు సమస్యలకు చెక్కు పెట్టే ఫుడ్స్.. మీరు తింటున్నారా..ప్రతి ఒక్కరూ జుట్టు రాలకుండా అందంగా పొడవుగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాలతో జుట్టు నిర్జీవంగా మారిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన ఈ సూపర్ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలి

గుడ్డు
గుడ్డులో విటమిన్ డి, విటమిన్ బి 12, ఐరన్, బయోటిన్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉండటం వలన జుట్టు కుదుళ్లకు అవసరమైన బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు ఒక గుడ్డు తింటే సరిపోతుంది.

బాదంపప్పు
బాదంపప్పులో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు మరియు బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి. బాదంలో విటమిన్ ఈ, మెగ్నీషియం, ఒమేగా త్రీ, విటమిన్ ఈ, బయోటిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది. బాదం పప్పులో ఉండే మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే ఒమేగా త్రీ జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది.

పాలకూర
పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, పోలేట్, బయోటిన్ వంటి పోషకాలు ఉండటం వలన జుట్టు కుదుళ్ళకు అవసరమైన ఆక్సిజన్ చేరవేసి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. వారంలో రెండుసార్లు పాలకూరను తీసుకుంటే సరిపోతుంది.

సాల్మన్ చేప
సాల్మన్ చేపలో ఒమేగా త్రీ, ఆరోగ్యకరమైన కొవ్వు ఉండుట వలన జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే బయోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. వారంలో రెండుసార్లు సాల్మన్ ఫిష్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.

సీడ్స్
సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు, అవిస గింజలు, చియా గింజలు, వాల్నట్స్, జీడిపప్పు వంటి గింజలలో బయోటిన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. అందువలన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఈ సీడ్స్ ని తినటం అలవాటు చేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ