Hair Care Tips:జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అయితే ఈ ప్యాక్ ట్రై చేయండి..
Hair Care Tips:జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అయితే ఈ ప్యాక్ ట్రై చేయండి.. మారిన జీవన శైలి, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం, జుట్టు పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా జుట్టుకి సంబంధించి కరెంట్ ఉత్పత్తులను వాడటం వలన కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది.
ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగి పోయారా.. అయితే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు ఫాలో అయితే చాలా సులభంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
దీని కోసం మిక్సీ జార్ తీసుకొని దానిలో నాలుగు మందార పువ్వులు, రెండు మందార ఆకులు, రెండు రెబ్బల కరివేపాకు, అర కప్పు అలోవెరా జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ ఆముదము ఒక విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి షవర్ కాప్ ధరించి గంట తర్వాత తేలికపాటి షాంపూ తో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలకుండా సూపర్ స్ట్రాంగ్ గా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్యాక్ వేసుకుని జుట్టు రాలే సమస్యకు పెట్టేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

